Telugu

షారుక్ ఖాన్ ఆస్తి విలువ 39,791,970,000 రూపాయలు!

తెలివైన పెట్టుబడుల ప్రియుడిగా టాలీవుడ్ లో ‘కింగ్’ నాగార్జునకు ఎలాంటి పేరు అయితే ఉందో, బాలీవుడ్ లో ‘బాద్ షా’ షారుక్ ఖాన్ కు కూడా అంతే పేరు ఉంది. ఆ పెట్టుబడుల ప్రభావంతోనే కింగ్ ఖాన్ షారుక్, తాజాగా ఓ రేర్ ఫీట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులైన నటులలో షారుక్ రెండవ స్థానంలో నిలిచి అందరినీ అవాక్కు చేసారు.

బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా నిలిచిన షారుక్, కోల్ కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్స్ సహా పలు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి చర, స్తిరాస్తులన్నీ కలిపి దాదాపుగా 600 మిలియన్ డాలర్లుగా ఉంటాయని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో లెక్కించాలంటే అక్షరాలా 39,791,970,000 రూపాయలు.

ADVERTISEMENT

1989 టీవీ సీరియల్ ద్వారా నట ప్రస్థానం ఆరంభించిన షారుక్, అనతి కాలంలోనే బాలీవుడ్ లో అగ్ర స్థాయి నటుడిగా ఎదిగి అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. బాలీవుడ్ లో అత్యంత క్రేజీ హీరోగా ఇప్పటికీ షారుక్ అంటే పడి చచ్చే అభిమానుల సంఖ్యకు కొదవలేదు. ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రపంచంలోనే సెకెండ్ రిచెస్ట్ నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు మన కింగ్ ఖాన్.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

The Paradise: Can Box Office and Harsh Reviews Coexist?

The gap between film reviewers and audiences is nothing new in Telugu cinema. Nani's The…

5 hours ago

IND vs WI: Test Retirement Changed Him? Prime Virat Back

Virat Kohli and Shubman Gill smashed centuries as India defeated West Indies by eight wickets…

5 hours ago