
ఆదివారం సోషల్ మీడియా మొత్తం హల్ చల్ చేసిన వార్త శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్. బై ఎలక్షన్స్ చెప్పకుండా ఎలా నిర్వహిస్తారు? అంటూ శేఖర్ మాస్టర్ ప్రశ్నించడంతో.. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఏకంగా పోలీసులు వచ్చి గొడవను సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాంటిది.. సోమవారం మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ చాలా క్లియర్ గా & సింపుల్ గా “మా మధ్య గొడవలేం లేవు, నిన్న మీరు చూసిందంతా ఫేక్. సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా?” అని చర్చించుకునేందుకు మేం అందరం వచ్చాం.
మా బాడీలో కొన్ని విషయాల మీద చర్చించుకున్నాం. కొన్ని వీడియోలు పట్టుకుని నాకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు. అవన్నీ ఫేక్. శేఖర్ మాస్టర్, బాను మాస్టర్ ఇలా అందరూ మంచి వ్యక్తులు. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులం కాదు. అందరికి అందరం సపోర్ట్‌గా ఉంటాం. ఈ వీడియోలు చూసి చిరంజీవి గారు కూడా షూటింగ్‌లో మాతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్ గారు, నేను, చిరంజీవి గారు కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. మాలో ఎలాంటి గొడవలు లేవు అని స్పష్టం చేశాడు జానీ.
ఎంత కవర్ చేసినా.. పోలీసులు వచ్చి సెటిల్ చేయాల్సినంత హడావుడి జరిగాక సింపుల్ గా ఇలా మాట్లాడడం అనేది జానీ, శేఖర్ ఎలాంటి ఫేక్ బబుల్ లో ఉన్నారు అనేది స్పష్టం చేస్తోంది.
మీడియా ముందుకు వచ్చి కవర్ చేసారు సరే.. మరి ఇంటర్నల్ ఇష్యూస్ ఎలా మ్యానేజ్ చేస్తారు? అసలు జానీ వర్సెస్ శేఖర్ అనే మ్యాటర్ ని ఎలా సెటిల్ చేస్తారు అనేది చూడాలి.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…