
అయితే పార్టీ మార్పు వెనుక అసలు ఉద్దేశం రాజకీయ వర్గాలకు తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన నంద్యాల స్థానంలో తాను బరిలోకి దిగాలన్న ఆశలు అడియాశలు కావడంతో, అదే సీటును వైసీపీ ద్వారా పోటీ చేయడానికి శిల్పా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. శిల్పా వైసీపీ జెండా కప్పుకోగానే, తనను నంద్యాల స్థానం నుండి బరిలోకి దింపుతున్నట్లుగా స్వయంగా జగన్ ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో శిల్పా ఉన్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఎన్నికలపై అతి త్వరలో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసిన నంద్యాల ఉప ఎన్నిక సీటు గొడవ, శిల్పా చేరికతో వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల వైసీపీ టికెట్ తనదే అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో, వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. నియోజక వర్గంలో వైసీపీని బలోపేతం చేసుకోవడానికి పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే, ఉప ఎన్నికలో టికెట్ తనదే అంటూ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని… టికెట్ ఇస్తానని జగన్ ఆయనకు ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
నంద్యాల టికెట్ తనకే అని జగన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారని… ఇదే విషయాన్ని జగన్ కు కూడా మళ్లీ చెబుతానని అన్నారు. వైయస్ కుటుంబంతో తనకు 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని, నంద్యాల టికెట్ తనదేనని, జగన్ తనకు అన్యాయం చేయరని చెప్పడంతో నంద్యాల ఉప ఎన్నిక సీటుపై రాజగోపాల్ రెడ్డి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పకనే చెప్పారు. దీంతో జగన్ నోట నుండి ఎవరి పేరు వస్తుందోనని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. శిల్పాకు పేరు ప్రకటిస్తే రాజగోపాల్ రెడ్డికి… అలాగే రాజగోపాల్ పేరు ప్రకటిస్తే… వచ్చి రావడంతోనే శిల్పాకు జగన్ భారీ షాక్ ఇవ్వడం ఖాయమన్న మాట.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…