
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన 30 ఏళ్ల హీరోయిన్ షెర్లీ దాస్ నే వివాహమాడబోతున్నారు. అయితే మీడియా సమక్షంలోనే ఉంగరాలు మార్చుకుని వీరిద్దరూ కొత్తజంటగా మారారు. చెన్నైలోని లీ మ్యాజిక్ లాంటెర్న్ థియేటర్ లో ప్రదర్శించే సినిమా ప్రివ్యూ కోసం మీడియాను ఆహ్వానించిన ప్రభాకరన్, “గతంలో షెర్లీతో సినిమా తీసినప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లికి దారి తీసిందని చెప్పి, ఇద్దరూ అక్కడికక్కడే ఉంగరాలు మార్చుకుని” ప్రివ్యూకు హాజరైన మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు.
అయితే ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ పేరుతో విడుదలైన సినిమా కధ కూడా ఓ దర్శకుడు హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అన్నదే ఇతివృత్తంగా సాగుతుంది. దీనినే రియల్ లైఫ్ లో వేలు ప్రభాకరన్ – షేర్లీలు అనుసరించడంతో ఇది నిజమైన పెళ్ళా లేక సినిమా పబ్లిసిటీ స్టంటా? అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. ఏది ఏమైతేనేం… 60 ఏళ్ళ వయసులోనూ కొత్త పెళ్ళికొడుకు అవతారంలో వేలు ప్రభాకరన్, కోలీవుడ్ నాట ప్రధాన వార్తల్లో నిలిచారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…