
ఈ కార్యక్రమం ఆద్యంతం వర్మను పైకి లేపడంలో సక్సెస్ కాగా, వర్మ తన “వంగవీటి” సినిమాను పైకి లేపడంలో సక్సెస్ సాధించారు. దీంతో ఈ వారంలో విడుదల కాబోతున్న అన్ని సినిమాలను పక్కనపెట్టే విధంగా “వంగవీటి” లైంలైట్ లోకి వచ్చింది. విజయవాడ రౌడీచరిత్ర ఆధారంగా తీస్తున్న “వంగవీటి”పై అంచనాలు ఉన్న మాట వాస్తవమే గానీ, ఈ వేడుక మాత్రం ఆ అంచనాలను మరింతగా రెట్టింపు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే… ఈ ప్రభావం ‘వంగవీటి’ సినిమా ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా పడే అవకాశం ఉంది.
అనుకున్న విధంగానే ‘వంగవీటి’ ద్వారా భారీ సక్సెస్ అందుకోగలిగితే గనుక, మరోసారి వర్మ పేరు మారుమ్రోగడం ఖాయం. అలాగే నిర్మాతలు మళ్ళీ వర్మ ముందు క్యూలు కట్టడం ఖాయం. ఎందుకంటే… తన నుండి రాబోయే ప్రతి సినిమా ఉన్నతమైనదిగా ఉంటుందని వర్మ చెప్పారు గనుక! ‘శివ’ ద్వారా నాగ్ ని పరుగెత్తించి, ‘క్షణక్షణం’ ద్వారా తనను మాత్రం కూర్చోబెట్టారని విక్టరీ వెంకటేష్ చమత్కరించడంతో, విక్టరీతో ఒక హీరోయిజం ఉన్న సినిమాను చేస్తానని ఈ సందర్భంగా వెంకీకి మాట ఇచ్చారు వర్మ! ఇది చూసి వర్మలో ఎంత మార్పు… ఎంత మార్పు… అని ముక్కున వేలేసుకోవడం వీక్షకుల వంతయ్యింది..!
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…