
రంగస్థలమే తన కెరీర్ ప్రారంభించానని, ఆ తర్వాత రేడియో నాటికలతో ముందుకు వెళ్లానని చెప్పారు. అనంతరం, సినీ పరిశ్రమలోకి రావడం రచయితగా, నటుడిగా కొనసాగడం జరిగిందన్నారు. అయితే, సినిమాల్లో నటిస్తున్నా తనకు తెలియని అసంతృప్తి ఉండేదని అన్నారు. సినిమాల్లో ఏ సన్నివేశం ఎప్పుడు తీస్తారో తెలీదని, ముందు కామెడీ సీన్ చేసి, ఆ తర్వాత ప్రేక్షకులను కన్నీరు పెట్టించే సన్నివేశం చేస్తారని అన్నారు. ఆ విధంగా నటించడం వల్ల కథలోని భావోద్వేగానికి దూరమవుతున్నానని అనిపించేందని అన్నారు.
అయితే, నాటకాల్లో అలా ఉండదన్నారు. మళ్లీ నాటకాలాడాలని ఉన్నప్పటికీ వాటి ఆదరణ కాస్త తగ్గిందన్నారు. నాటకాభిమానుల కోసం నాటకాలు వేయాలనుకున్నప్పటికీ, సినిమాల వల్ల సమయం కేటాయించలేనేమో అనిపించిందన్నారు. నాటకాలకు ప్రత్యామ్నాయంగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించాలనిపించిందన్నారు. అయితే, సినిమాల్లో చేస్తే షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తే ఆదరణ తగ్గుతుందన్న మాటలను పక్కనబెట్టి ‘రాళ్లు’ అనే ఒక లఘు చిత్రాన్ని నిర్మించానని చెప్పారు.
అంతర్జాతీయ చిత్రోత్సవంలో “రాళ్లు” ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుందని నాటి విషయాలను ప్రస్తావించారు. నేను నేర్చుకున్న, నాకు తెలిసిన మంచి విషయాలతో నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టానని, అందరి మనసులకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు ఏడు లఘు చిత్రాలను తీశానని తనదైన మాటతీరుతో ప్రేక్షకులను నవ్వించే ఎల్బీ శ్రీరామ్ చెప్పారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…