
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18 సీజన్ లో ప్రతి క్రికెట్ అభిమాని కన్ను శ్రేయాస్ అయ్యర్ మీదే ఉంది. అతని సారధ్య లక్షణాలు, నైపుణ్యం ఏంటో అందరికి తెలుసు. ఢిల్లీ జట్టు గడ్డుకాలం లో పయనిస్తున్నప్పుడు, సారధి బాధ్యతలను తన భుజం పై వేసింది ఢిల్లీ యాజమాన్యం. కానీ, అప్పుడు జరిగినది చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.
ఎప్పుడో 2012 లో ప్లే-ఆప్స్ కు చేరిన ఢిల్లీ జట్టు ఆ తరువాత 6 సీజన్లు లీగ్ స్టేజిలోనే నిష్క్రమించబడింది. అటువంటి జట్టుకు తాను సారధి అయిన మొదటి సీజన్ ఐపీఎల్ 2019 లో నే ప్లై-ఆప్స్ కు పట్టుకెళ్ళాడు శ్రేయాస్ అయ్యర్. ఇక, 2020 లో అయితే ఏకంగా ఫైనల్స్ ను చేరింది ఢిల్లీ జట్టు.
ఇక 2021 మరియు 23 లో గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయిన శ్రేయాస్, 2022 లో కోల్కతా జట్టు కు ప్రాతినిధ్యం వహించాడు .2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో ‘కోల్కతా నైట్ రైడర్స్’ ను ఛాంపియన్స్ గా నిలబెట్టాడు శ్రేయాస్ అయ్యర్. అయితే ఆ సీజన్ కప్పును అందుకున్న కెప్టెన్ గా పేరు దక్కినప్పటికీ ఆ క్రెడిట్ అంతా గంభీర్ కే వెళ్లిపోయింది.
దీనితో అయ్యర్ కు కెప్టెన్ గా దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదనే చెప్పాలి. ఇక, 2024 లో 261 పరుగులను డిఫెండ్ చేసుకోలేక, పంజాబ్ చేతిలో ఘోర అవమానం పొందాడు అయ్యర్. కట్ చేస్తే, 2025 లో అదే పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా మారి, తన ఎక్స్-ఫ్రాంచైజ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ కు ఈసారి మరొక ఘోరమైన రికార్డును అందించాడు.
ఐపీఎల్ చరిత్ర లోనే అత్యంత స్వల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్నాడు సారధిగా అయ్యర్. ఈ సీజన్ లో కేవలం కెప్టెన్ గానే కాకుండా బ్యాట్ కూడా పని చెప్పాడు. దీనితో ఈ సీజన్లో 6 మ్యాచ్ లకు గాను 250 పరుగులు చేసి ఈ సీజన్ లోనే అత్యధిక పరుగులు చేసిన 4 వ బ్యాటర్ గా నిలిచాడు.
2024 లో తాను కెప్టెన్సీ చేసిన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ ను అందించాడు అయ్యర్, కానీ అపుడు తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని అనటంలో సంకోచమే లేదు. 2025 సీజన్ లో 2 వ ఖరీదైన ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు అయ్యర్. ఆక్షన్ లో పంజాబ్ యాజమాన్యం 26 .75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినందుకు, అయ్యర్ పైసా-వసూల్ చేస్తున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘తనపై ఉన్న అనుమానాలకు, జరిగిన అవమానాలకు.. ఇదే సానుకూలమైన సమాధానమవుతుంది’ అంటున్నారు శ్రేయాస్ అభిమానులు. అలాగే ఇటు తన కెప్టెన్సీ బాధ్యతలతో అందరిని మెప్పిస్తూ కాబోయే టీం ఇండియా భవిష్యత్ సారధి శ్రేయస్సేనా అనేలా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు.
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…
Katrina Kaif is in a new phase of life after becoming a mother, but her…