‘మజ్ను’లో శృతి కన్ఫర్మ్‌

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘ప్రేమమ్‌’ను అక్కినేని హీరో నాగచైతన్య రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇదే చిత్రంలో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటి వరకు అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో శృతిహాసన్‌ ముఖ్య పాత్రలో కనిపించనుందట.

‘ప్రేమమ్‌’ రీమేక్‌ ‘మజ్ను’ చిత్రంలో శృతిహాసన్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా హీరోయిన్‌గా కాకున్నా కూడా శృతిహాసన్‌ ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ‘కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ఈ రీమేక్‌లో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Share
Published by

Recent Posts

The Traitors Telugu: Two Players Secure ₹42.77 Lakh Victory

Shravya Varma and Sweekar Agasthi emerged as the winners of The Traitors Telugu Season 1,…

44 seconds ago

కేసు ఏదైనా మనీ లాండరింగ్ తప్పనిసరి!?

నాడు అక్రమాస్తుల కేసుల మొదలు, వివేకానంద రెడ్డి హత్య కేసుతో సహా మద్యం కుంభకోణం, దాని రవాణా, తాజాగా కుంభకోణం,…

51 minutes ago