
[m9ad]
శృతి హాసన్…యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి, తోలి రోజుల్లో అనేక చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ తర్వాత వరుస హిట్స్ తో బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేసింది. అయితే వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆమెకు సడన్ గా తన పాత ఫోటో ఒకటి దొరకడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. కట్ చేస్తే ఆ ఫోటో కి తన అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. కొందరు అభిమానులు ఏకంగా ఆ ఫోటోను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు..అయితే ఆ ఫొటోలో శృతి సినిమా ఇండస్ట్రీ కి రాకముందు తానూ ముంబైలో చేసిన ఒక షో లో తన పాట ప్రదర్శన ఉండడంతో “త్రో బ్యాక్” అంటూ ఆ ఫోటోను పోస్ట్ చేసింది శృతి.
మొత్తం ఆ రోజుల్లో తాను చేసిన మ్యూజిక్ (ఆల్బమ్)…ఈ రోజుల్లో తాను చేస్తున్న అందాల మ్యాజిక్ ఈ రెండింటిలో ఏది బావుందో, ఏ రోజులు బావున్నాయి ఆమెనే చెప్పాలి.
December 24 will have two Kings arriving in theatres. However they belong to two different…
Women often speak about fighting for equal opportunities, but what happens when they fail to…