
పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అనే ప్రశ్నకు ఫైనల్ గా శృతిహాసన్ రూపంలో సమాధానం దొరికింది. సాంగ్ షూట్ జరుగుతున్నట్లు బుచ్చిబాబు స్వయంగా చెప్పడంతోపాటుగా.. సదరు పాట విజువల్స్ కూడా లీక్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే.. ఇక్కడ చిన్న టెన్షన్ కూడా ఉంది. అదేంటంటే, శృతిహాసన్ ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. అప్పట్లో మహేష్ సరసన “ఆగడు” సినిమాలో జంక్షన్ లో అనే పాటలో శృతి చేసిన డ్యాన్స్, గ్లామర్ బాగా హైలెట్ అయినప్పటికీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత హిందీలోనూ ‘ఒక్కడు’ హిందీ రీమేక్ అయిన “తేవర్”లో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
ఇక రీసెంట్ గా శృతి స్పెషల్ సాంగ్ చేసిన “హాయ్ నాన్న” చిత్రం డీసెంట్ హిట్ గా నిలవగా, శృతి పాటను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు “పెద్ది” సినిమాలో శృతి స్పెషల్ సాంగ్ ప్లస్ అవుతుందా లేక శృతి లేడీ లక్ ఎఫెక్ట్ అవుతుందా అనేది జూన్ 25 కి తెలుస్తుంది.
Nara Lokesh officially took charge as the Working President of the Telugu Desam Party in…
Andhra Pradesh Chief minister Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan have the inherent resolute…