Telugu

సినిమాలు ఇలాక్కూడా ఆగిపోతాయా?

హెయిర్ స్టైల్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోవడం సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఇంతకీ ఏమా కథ అంటే… బాలీవుడ్ యువనటుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ‘రీ లోడెడ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో తదుపరి సినిమా ‘ఇత్తెఫాక్’ అనే సినిమాలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఇంతలో ‘రీ లోడెడ్’ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ అనంద్ కొన్ని సన్నివేశాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ‘ఇత్తెఫాక్’లో నటిస్తున్న సిద్ధార్థ్ కు కబురు పెట్టి కొన్ని సీన్లు చిత్రీకరించాడు. ఈ సమయంలో సిద్ధార్థ్ హెయిర్ స్టైల్ మార్చినట్టు గుర్తించాడు.

దీంతో ప్యాచ్ వర్క్ షూటింగ్ ఆపేయించి, హెయిర్ పెంచాలని సూచించాడు. దీంతో సిద్ధార్థ్ హెయిర్ పెంచే పనిలో పడ్డాడు. హెయిర్ పెంచిన తరువాత ప్యాచ్ వర్క్ తో పాటు ప్రమోషనల్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నట్టు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపాడు. కాగా, ఈ సినిమా ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు సీక్వెల్ అంటూ వార్తలు రావడంతో, ‘నాట్ బ్యాంగ్ బ్యాంగ్-2’ అని క్లాప్ బోర్డులపై కూడా రాయించామని తెలిపాడు. అయితే సిద్ధార్థ్ హెయిర్ స్టైల్ తమ సినిమా ‘ఇత్తెఫాక్’ కు సరిపోకపోవడంతో ఆ సినిమా షూటింగ్ కూడా ఆగింది. దీంతో కేవలం హెయిర్ స్టైల్ కోసం రెండు సినిమాల షూటింగ్ ఆపిన తొలి హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నిలిచాడు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?

After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…

22 minutes ago

Happy Journey Locks Theatrical Release Date

Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…

28 minutes ago