
[m9ad]
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఆశాజనకంగా ఉండడం విశేషం. నరేష్ నటించిన గత కొన్ని సినిమాల ట్రైలర్స్ ను పరిశీలిస్తే… ఇది కాస్త బెటర్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ట్రైలర్ లో ద్వారా కధపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసారు. ఇద్దరు స్నేహితులు కలిసి చేసే అడ్వెంచర్ కామెడీగా ఈ “సిల్లీ ఫెలోస్” తెరకెక్కిందని స్పష్టం చేసింది.
ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ప్లస్ పాయింట్ ఏమిటంటే… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు మిస్ అయిన సునీల్ కామెడీ మళ్ళీ బ్యాక్ టు ఫాం అన్న నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించింది. చిత్ర శుక్ల, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ వంటి ప్రధాన తారాగణం కూడా కనిపించగా, శ్రీవసంత్ సంగీతం అందించాడు.
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…