
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు, కష్టాలలో సెలబ్రెటీల కష్టాలు వేరయా అని అనుకోక తప్పదు ప్రముఖ తెలంగాణ జానపద గాయని మంగ్లీ-లాయర్ సుబ్బారావు వివాదం చూస్తున్నప్పుడు.
ప్రస్తుతం వారి వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. ఇద్దరూ పరస్పరం అదే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేసుకోగా పోలీసులు కేసులు నమోదు చేశారు.
సుబ్బారావు వెర్షన్: మంగ్లీ నాకు ఫోన్ చేసి రోడ్ యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరించింది. నిరుపేద ప్రజలను మోసగించిన ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీపై నేను కేసు వేసి వాదిస్తున్నందునే నాకు ఈ బెదిరింపులు.
మంగ్లీ వెర్షన్: నాకు ఆ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి ఎటువంటి సంబందమూ లేదు. నేను నా పాటల ప్రపంచంలో బ్రతుకుతున్నాను. నాకు మంచి పేరు ప్రతిష్టలు, కావాల్సినంత డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవే. ఎన్నడూ అడ్డుదారులు తొక్కలేదు. ఆ అవసరం కూడా లేదు.
నాతో పరిచయం ఉన్నవారు లేదా నా పేరు చెప్పుకొని ఎవరో ఏదో చేస్తే దానికి నేనెలా బాధ్యురాలిని? సుబ్బారావుకి సినిమాలలో చేయాలనే కోరిక ఉంది. బిగ్ బాస్ షోలో పాల్గొనాలనుకుంటున్నాడు. నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ, నా పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండాలంటే కొంత డబ్బు ఇవ్వాలని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ మరో మాట కూడా అన్నారు. “నేను చాలా బిజీగా ఉండటం వలన కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వూలు ఇవ్వలేకపోతున్నాను. ఆ కారణంగా ఎవరైనా నాపై కక్ష కట్టారేమో? లేకుంటే నిజానిజాలు నిర్ధారించుకోకుండా నా గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా ప్రచురిస్తారు?” అని మంగ్లీ ప్రశ్నించారు.
ఇద్దరి వెర్షన్స్ చూసిన తర్వాత మంగ్లీ బాదితురాలని అర్ధమవుతుంది. కావచ్చు. కాకపోవచ్చు. కానీ ఈ వ్యవహరం చూస్తున్నప్పుడు, మీడియాపై ఆమె చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, సెలబ్రెటీలకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ఎంత మంది అభిమానులు ఉన్నప్పటికీ ఎటువంటి అనూహ్యమైన సమస్యలు ఎదుర్కొంటారో అర్ధమవుతుంది.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…