
ఈ లీక్స్ కు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ పని చేసారని ఆరోపణలు గుప్పించింది. చెన్నైకు చెందిన ఓ సంస్థ ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లుగా సుచిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరినీ నొప్పించే మనస్తత్వం తనది కాదని, శత్రువైనా సరే అవమానించే రకం నేను కాదని, తన తప్పు కానప్పటికీ, తన వలన బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెబుతున్నానని వివరణ ఇచ్చుకుంది.
ఈ షాక్ నుండి కోలుకోవడానికి తనకు ఆరు వారాల సమయం పట్టిందని, ఇందుకు తన భర్త, కుటుంబ సభ్యులు చాలా సహకరించారని తెలిపింది. అయితే సమాధానం లభించని ఎన్నో ప్రశ్నలను సుచిత్ర వదిలివెళ్ళడం విశేషం. నిజంగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయితే, సదరు సెలబ్రిటీల వీడియోలన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? నిజంగా తన ప్రమేయం లేకుండా జరిగితే, నాడే మీడియా ముందుకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఇలాంటి ప్రశ్నలకు కొదవలేదు. ఏది ఏమైనా సదరు ‘సుచిలీక్స్’కు శుభంకార్డు వేయడానికి ఎట్టకేలకు తన స్వరం విప్పింది.
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…