
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విడుదలై విజయవంతం అయిన తర్వాత… శాతకర్ణి చరిత్రను వక్రీకరించారు… సక్రీకరించారు… అని పలువురు విమర్శలు చేస్తున్నారని అది సరికాదని, తాను ఈ సినిమాకి పాటలు రాయాల్సి వచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్రప్రశస్తిని చదివానని, శాతకర్ణి గురించి అందులో ఉందని సిరివెన్నెల తెలిపారు.
చక్రవర్తులందరిలో మిన్నయిన చక్రవర్తి శాతకర్ణి అని అందులో ఉందని, ఒక శకానికి ఆరంభకడుగా పిలవదగిన వ్యక్తి శాతకర్ణి అని, ఈ సినిమా ఆర్థికమైన విజయం సాధిస్తోందని, చారిత్రకమైన విజయం సాధించిన సినిమాగా కూడా నిలుస్తుందని అన్నారు. నందమూరి బాలకృష్ణను తండ్రిని మించిన తనయుడు అంటే బాగుంటుందని ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిప్రాయ పడ్డారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…