
తన భార్య మధుమిత మొబైల్ ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి మెస్సేజ్ లు వస్తున్నాయని, ఈ మెస్సేజ్ లు బయటకు చెప్పుకోలేనంత అసభ్యంగా ఉన్నాయని, తనపై ఉన్న కోపంతో నన్ను ఏమీ చేయలేక తన భార్యను టార్గెట్ చేస్తున్నారని శివబాలాజీ ఆరోపించారు.
యూ ట్యూబ్ వీడియోలలో అశ్లీలత, మార్ఫింగ్ ఫోటోల సంస్కృతి పెరిగిపోవడాన్ని తాను గట్టిగా ఖండించడంతో కొందరు తనపై కక్ష కట్టారని, ఈ మెస్సేజ్ లు పంపింది వారి మనుషులేనని చెప్పిన శివబాలాజీ, అతి త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారన్న నమ్మకముందని అన్నారు.
సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సమాజంలో సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పలు సినిమాలలో నటించిన మధుమతి, వివాహం తర్వాత సిల్వర్ స్క్రీన్ కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు…
Sunil Gavaskar has questioned the BCCI over the new Ranji Trophy schedule, with the former…