Telugu

రాజధాని తరలింపులో చితికిపోయేది చిన్న రైతులే

మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ సంబంధిత బిల్లులకు గవర్నర్ రాజముద్ర వెయ్యడంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిరకాల వాంఛ నెరవేరుతుంది. దీనితో అతిత్వరలో రాజధానిని విశాఖపట్నంకు తరలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బాగా ఆలస్యం అనుకుంటే విజయదశమి నాటికి ఆ ప్రక్రియ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది.

అయితే ఈ నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అమరావతి నిర్మాణం కోసం 29,481 మంది రైతులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంలో 34,322 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ రైతులలో 5,227 మంది రైతులు ఒకటి నుండి రెండు ఎకరాల భూమిని ఇవ్వగా, మరో 3,337 మంది రైతులు రెండు నుంచి ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు.

ADVERTISEMENT

కాబట్టి, చిన్న మరియు మధ్య తరహా రైతులు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆపడానికి రైతులు కోర్టుల మీద తమ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఒకవేళ తరలింపు ఆపిన రైతులు ఆశించిన స్థాయిలో, అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో అమరావతిని జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం లేదు.

దీనితో ఏ రకంగా చూసినా భూములిచ్చిన రైతులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా… మూడు రాజధానుల గెజిట్‌ను నిలిపి వేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ మేర‌కు హైకోర్టు గ‌డ‌ప తొక్కింది. దీనిని హైకోర్టు ధర్మాసనం రేపు విచారణ చేప‌ట్ట‌నుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

మోదీ పర్యటన: సింహాలు గాయపడ్డాయా.?

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…

25 minutes ago

South Indian Assembly: Cinema Flavour Mama!

South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…

50 minutes ago