
యూరప్ లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం తమ ఇంట్లో ఉన్న ఎల్‌జీ స్మార్ట్ టీవీలో ఓ సినిమాను చూసేందుకు ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులు ఆ టీవీలో మూవీ చూస్తుండగా మధ్యలో ఆగిపోయింది. అనంతరం స్క్రీన్ పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఇమేజ్ వచ్చింది. దీంతో సదరు ఇంజనీరు ఆ టీవీని మళ్లీ సెట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మళ్లీ టీవీ ఆన్ కాలేదు. దీంతో తమ ఇంటికి వచ్చి టీవీని బాగుచేయాల్సిందిగా టెక్నీషియన్‌కు చెప్పాడు.
దీంతో వారి ఇంటికి వచ్చి టెక్నీషియన్ ఆ టీవీని రీసెట్ చేయడానికి 23,170 రూపాయలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం) ఖర్చవుతుందని చెప్పాడు. అంతేగాక, టీవీలో సోకిన వైరస్ ను తొలగించడానికి మరో 11 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయ్యింది. సదరు ఇంజనీరు తమ ఇంట్లోని ఆ స్మార్ట్ టీవీలో యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ నే ఉపయోగించాడా? లేదా వేరే సైట్లను ఉపయోగించాడా? అనే విషయం గురించి సమాచారం లేదు.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…