
దీనితో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా పర్యటనలో ఉండడంతో సచివాలయం పెద్దగా సందడి లేదు. మంత్రులంతా వారి నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు. దీనితో సందర్శకుల తాకిడికూడా పెద్దగా లేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.
ఈ సందర్బంగా బూసన్ బిజినెస్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్‌కు, మేకిన్ ఇండియా కొరియా సెంటర్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఎంఐసీ (మేకిన్ ఇండియా కొరియా సెంటర్) ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తుంది. అలాగే బూసన్‌లో ఆంధ్రప్రదేశ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. బిజినెస్ సెమినార్లో మధ్యాహ్న భోజన సమావేశంలో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
Malavika Mohanan slips into a dreamy white mood and turns quiet elegance into a full…
Kind of creative choices that Ram Charan made after epic success of RRR are largely…