మంత్రి చేతిలో “పాములు!” తెచ్చిన తిప్పలు!

బీహార్ ఐటీ శాఖ మంత్రి అశోక్ కుమార్ చౌదరి చేతిలో పాముల్ని పట్టుకుని కాంగ్రెస్ వైస్-ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్‌కి ఆశీర్వాదాలు అందజేస్తున్న ‘ఫోటోలు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ‘మూఢవిశ్వాసాలకు’ వేదికగా మారిన ఈ ఫోటోలు బీహార్ రాజకీయ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ప్రస్తుత తరంలో మూఢ విశ్వాసాలకు చోటులేదని, సదరు ఫోటోలను ప్రస్తావిస్తూ జేడీయూ అధికార ప్రతినిధి కె.సి.త్యాగి విమర్శలు చేసారు. అయితే ‘మూఢ విశ్వాసాలకు తానూ వ్యతిరేకిని, ఈ ఫోటోలు ఇప్పటివి కాదని, పాతవని, తన దగ్గరకు తరచూ పాములు పట్టేవాళ్ళు వస్తుంటారని, సరదాగా పిల్లల చేతిలో వాటిని పెట్టబోయి తన చేతిలో పెట్టి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

అయితే, పాముల చేత భయపడకుండా ఆశీర్వాదాలు అందుకున్న సదరు కాంగ్రెస్ నేత సుబోధ్‌కుమార్ చెప్పిన వ్యాఖ్యలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. “మకర సంక్రాంతి పూజ రోజున మంత్రి గారెతో తానూ ఈ ఫోటోలు తీసుకున్నట్లు” తెలిపారు. దీంతో ఈ పాముల “లోగుట్టు” ఎవరికెరుక… అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

27 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

50 minutes ago