
ఒకప్పుడు ప్రజాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు చాలా పరిమిత వేదికలు ఉండేవి. పత్రికలు, టెలివిజన్, సభలు, సమావేశాలు వంటి కొన్ని మార్గాల ద్వారా ప్రజల గొంతు పరోక్షంగా వినిపిస్తూ ఉండేది.
కానీ ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు చేతిలో ఒక మొబైల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. మన అభిప్రాయాన్ని యావత్ ప్రపంచానికి వినిపించే అవకాశం అవి కల్పిస్తున్నాయి.
అది సినిమా లేదా సినీ నటీనటులు, దర్శకులు గురించి కావచ్చు. లేదా ఓ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ వాటి నాయకుల గురించి కావచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల గురించి కావచ్చు. లేదా సామాజిక సమస్య గురించి కావచ్చు. ఈ ఆకాశం కింద ఉన్న దేని గురించైనా ప్రతి ఒక్కరూ తమ భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతున్నారు.
ఒక కోణంలో చూస్తే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప వరం. ఎందుకంటే గతంలో కొద్దిమందికే పరిమితమైన గొంతు, ఇప్పుడు అందరూ వినిపించగలుగుతున్నారు కనుక.
అయితే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి. సరిగ్గా ఇక్కడే సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతున్నాయి. అపరిమిత స్వేచ్ఛ, జవాబుదారీతనం లేకపోవడంతో సోషల్ మీడియాలో తిట్లు, అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, నిర్ధారణ లేని ఆరోపణలు చాలా సులభంగా వ్యాపిస్తున్నాయి.
తత్ఫలితంగా ఓ సినిమా, ఓ రాజకీయ పార్టీ జయాపజయాలను సోషల్ మీడియా ముందే నిర్ణయించేస్తోంది. అయితే అవాంఛనీయ పరిణామాలు ఇక్కడితో ఆగిపోలేదు. సోషల్ మీడియాలో ఈ అపరిమిత స్వేచ్ఛ, జవాబుదారీతనం లేనితనం వలన కొందరు చేస్తున్న అసత్య ప్రచారం, సృష్టిస్తున్న పుకార్లు వ్యక్తుల జీవితాలను తలక్రిందులు చేస్తున్నాయి.
కనుక సోషల్ మీడియాలో స్వేచ్ఛతో పాటు జవాబుదారీతనం కూడా తప్పనిసరి చేసేందుకు సదరు సంస్థలు, ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరంగా కనిపిస్తోంది.
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…
Ajay Devgn’s Drishyam: The Conclusion is doing wonders at the box office. The movie has…