Telugu

మనిషి సమాజంలో భాగమే కానీ… సొంత జీవితం ఉందిగా!

మనం సమాజంలో బ్రతుకుతున్నాం కనుక కొన్ని కట్టుబాట్లు తప్పవు. అవి అవసరం కూడా. కానీ సమాజంలో ఉన్నంత మాత్రాన్న ప్రతీది సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండాలనుకోవడం సరికాదు. అలా ఉండాలంటే మన వస్త్రధారణ, మాట తీరు, వ్యక్తిత్వం, చదువు, ఉద్యోగం, ఇల్లు, కుటుంబం అన్నిటినీ పదేపదే మార్చుకోవాల్సివస్తుంది.

నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలపై ఎంత వాదోపవాదాలు జరిగాయో అందరూ చూశారు. కనుక మహిళల వస్త్రధారణ తప్పనిసరిగా సమాజానికి నచ్చినట్లు ఉండాలా? అంటే అవును.. కాదు వాదనల మద్య ఓ సన్నటి గీత ఉంటుంది. అదే సమాజపు కట్టుబాట్లు.

ADVERTISEMENT

మరో ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు అద్దె ఇల్లయినా సొంత ఇల్లయినా వాస్తు తప్పనిసరి. వాస్తు సరిగా లేకుంటే? ఏదో భయం… అది ఈ సమాజం సృష్టించిన భయమేగా? వంద సంవత్సరాల క్రితం మన తాతముత్తాతలు ఈ వాస్తు తెలియకుండా, నచ్చినట్లు ఇళ్ళు కట్టుకొని జీవించారు కదా?

కనుక మన కోసం నిర్మించుకునే లేదా కొనుకునే ఇల్లు మన అవసరాలకి తగ్గట్లుగా సదుపాయంగా ఉండాలి. అందుకోసం వాస్తు పాటిస్తే తప్పులేదు. కానీ బంధుమిత్రులు లేదా ఇరుగుపొరుగువారు చెప్పే వాస్తు సలహాలను నమ్ముతూ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే, ఆ వాస్తు మార్పులతో మనకి ఒరిగేదేమీ ఉండకపోయినా ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది.

కనుక ఇంటి వాస్తు విషయంలో మనదే తుది నిర్ణయం కావాలి తప్ప సమాజానిది కాకూడదు. ఆ అవసరం లేదు కూడా.

ప్రతీ మనిషి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు సమాజంతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాడు. కనుక మనపై సమాజం ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ మన గురించి ఎవరు ఏమనుకుంటారో? అని ఆలోచిస్తూ ఇతరులకు నచ్చేలా, వారిని మెప్పిస్తూ జీవించాలంటే చాలా కష్టం. కానీ భార్యభర్తలు, తల్లితండ్రులు, పిల్లలు ఒకరి ఇష్టాఇష్టాలు మరొకరు తెలుసుకొని జీవించడం చాలా గొప్ప విషయం. అదే ఆఫీసులో బాస్ మాటక అయిష్టంగానైనా వినక తప్పదు. కనుక ఎక్కడ ఏది అవసరం ఏది కూడదు? అని ఎవరికీ వారు నిర్ణయించుకోవాల్సిందే.

సమాజపు కట్టుబాట్లకు లోబడి ఉండాలి కానీ సమాజం కోసం మన వ్యక్తిత్వం పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. మన జీవితం మనమే జీవించాలి.

కొంత వయసు, పరిణతి వచ్చిన తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే మనం సరైన మార్గంలోనే ప్రయాణించినట్లు అనిపించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Revolutionaries Review: A Long, Boring History Lecture

BOTTOM LINE A Long, Boring History Lecture PLATFORM PRIME VIDEO RUNTIME 7 Hours [8 Episodes]…

43 minutes ago

హాయిగా నవ్వుకొని ఎంత కాలం అయ్యిందో కదా?

బీఆర్ఎస్‌, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కేటీఆర్‌, ఇక్కడ జగన్‌ ఎల్లప్పుడూ ‘త్రీ రోజస్ టీ’లా షిక్కటి షిర్నవ్వులతో కనిపించేవారు.…

54 minutes ago