
అయితే ఆ తరువాత వరల్డ్ టూర్ కెళ్తున్నానని చెప్పి, సోషల్ మీడియాలో వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలు పోస్టు చేస్తూ సందడి చేసింది. మళ్ళీ కొన్నాళ్ళకు ట్విస్ట్ ఇస్తూ… ఫ్యాషన్ దుస్తులు ధరించి సన్యాసానికి గుడ్ బై చెప్పినట్టు చెప్పకనే చెప్పింది. ఇప్పుడు తాజాగా పెళ్లి చేసేసుకోబోతున్నానని ప్రకటించింది. అంతటితో ఆగితే మాట్లాడుకోవడానికి ఏముంటుంది? “తన పెళ్లిని జీసస్ స్వర్గంలో నిర్ణయించాడని తెలిపిన సోఫియా, తన పెళ్లికి మహాశివుడు, బుద్ధుడు అతిథులుగా హాజరుకానున్నారని” పేర్కొంది.
వారే కాకుండా రాఖీ సావంత్, బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న వారందర్నీ తన వివాహానికి ఆహ్వానిస్తానని చెప్పింది. త్వరలో తనకు కాబోయే భర్త గురించి వెల్లడిస్తానని ప్రకటించింది. దీంతో సోఫియా ఏం చెబుతుందోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలలో పెద్దగా అవకాశాలు లేకపోగా, ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా పెద్దగా అవకాశాలు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సోఫియా వార్తలలో కనిపించేందుకు ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…