Telugu

వీర్రాజు వీరంగానికి కారణం ఏంటో?

మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నాడట వెనుకటికి ఎవరో. అలా ఉంది బీజేపీ పద్దతి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రభావం చూపించలేకపోతున్న గుజరాత్ లో గెలుపు చూసి తొడగొడుతున్నారు ఆ పార్టీ నాయకులు. తాము గెలిచిన మూడు సీట్ల వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అనేస్తున్నారు సోము వీర్రాజు వంటి వారు.

కాకినాడలో తాము పొత్తులేకుండా పోటీచేస్తే 50 స్థానాలు వచ్చేవనీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. నిజానికి వారికి ఇచ్చిన 9 సీట్లలో చచ్చిచడి గెలిచింది మూడు. వైకాపా వాళ్లకు మోడీని దూషించిన వాళ్లకు కూడా టిక్కెట్టులు ఇచ్చిన ఘనత ఆ పార్టీది. బీజేపీపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నేతల అండ సోము వీర్రాజుకి ఉన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక సంఘ్ హస్తం ఉండిఉండొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీలో ఎప్పటినుంచో పోటీ నెలకొన్నది. ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో ఉండాలనేది సోము వీర్రాజు ఉద్దేశమట. ఎటూ పార్టీ రాష్ట్రంలో బలపడాలనుకుంటుంది కాబట్టి తానే సరైన అభ్యర్థిని అని ఆయన చూపించుకుని ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైతే మాత్రం రెండు పార్టీల బంధం విడిపోయినట్టే. ఈ విషయం అమిత్ షాకు తెలిసే కొత్త అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేస్తూ వస్తున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశంతో జట్టు కొనసాగించాలన్న భావనతోనే బీజేపీ అగ్రనాయకత్వం ఉందట. అక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తే ఈ పాటికే వీర్రాజు పట్టాభిషేకం అయిపోయేదట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hyderabad’s 1.32 Lakh Stadium: Criminal Waste of Money?

Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…

33 minutes ago

Hyderabad Hit-And-Run: Anand Sai’s Son Sandeep Arrested

Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…

43 minutes ago