
నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేందుకు శాసనసభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెపుతుంటే, వాటి ప్రకటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తోంది.
శాసనసభ సమావేశాల చివరి రోజున సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన ప్రభుత్వం రైతులకు రూ.1,28,300 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు. అక్కమ్మ చెల్లెమ్మల చేయూత పధకం కోసం ఈ మూడు సంవత్సరాలలో తన ప్రభుత్వం రూ.2,39,000 కోట్లు ఇచ్చినట్లు ప్రకటనలు ఇచ్చుకొన్నారు. రెండూ కలిపి మొత్తం రూ.3,67,300 కోట్లు అయ్యింది.
రైతులకు ఇచ్చిన సాయంలో ధాన్యం, తదితర కొనుగోలుకు రూ.51,740 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అయితే ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రైతులకు ఖర్చు పెట్టింది కేవలం రూ.18,605 కోట్లు మాత్రమే. రైతుల వద్ద ధాన్యం తీసుకొని దానికి డబ్బు చెల్లిస్తే అది ఉచితంగా ఇచ్చినట్లు ఎలా చెపుతుంది?కేంద్రప్రభుత్వం ఆ సొమ్ము మొత్తం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది కదా?మరి ధాన్యం కొనుగోలుకి చెల్లించిన సొమ్ముని రైతు సంక్షేమ పధకాలలో కలిపి చెప్పుకోవడం అబద్దం కాదా?ఆ అబద్ధాన్ని ప్రచారం చేసుకోవడం కోసం మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనం వృధా చేయడమే కాకుండా ఆ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం కూడా చేస్తోంది జగన్ ప్రభుత్వం,” అంటూ గణాంకాలతో సహా జగన్ ప్రభుత్వం ప్రజలను ఏవిదంగా మోసం చేస్తోందో, ఆ అబద్దాల కోసం మళ్ళీ ఏవిదంగా వందల కోట్లు ఖర్చుచేస్తోందో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…
In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…