Telugu

బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ బీ-టీం చేసేదాకా వదిలేలా లేరు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నాటి నుండీ ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా.. అమరావతి – మూడు రాజధానుల విషయంలో రెండు బోట్ల మీద సవారి చేస్తున్న బీజేపీ స్పష్టంగా ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని సమర్థిస్తూ ముందుకు వెళ్తుంది. పార్టీలో అమరావతి అనుకూల గళాలను అణచివేస్తున్నారు.

మూడు రాజధానుల మీద టీవీ చర్చలలో గట్టిగా మాట్లాడిన ఇద్దరు పార్టీ నాయకులను వీర్రాజు ఇప్పటికే సస్పెండ్ చేశారు. “వీర్రాజు సొంతంగా తీసుకున్న నిర్ణయమో లేక పార్టీ హై కమాండ్ చెప్పిందో గానీ ఆయన జగన్ పార్టీ అనుకూలమైన లైన్ తీసుకున్నారు. దానికి భిన్నంగా మాట్లాడితే వదిలేది లేదు అన్నట్టు కూడా సంకేతం ఇస్తున్నారు,” అని పార్టీలోని కొందరు అంటున్నారు.

ADVERTISEMENT

“ఇప్పటివరకు అమరావతికి అనుకూలంగా ఉన్న హిందూ మహాసభను కూడా కించపరుస్తున్నారు. దానితో సంఘ్ పరివార్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. మొత్తానికి వీర్రాజు బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ బీ-టీం చేసేదాకా వదిలేలా లేరు,” అంటూ వారు విమర్శిస్తున్నారు.

బీజేపీకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయేది ఏమీ ఉండదు. అయితే బీజేపీని నమ్మి పొత్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగించడం కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ తాజా వైఖరికి సమాధానం చెప్పుకోలేనట్టుగా ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Rajinikanth’s Next Film Facing Behind-the-Scenes Chaos

Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…

1 hour ago

Pics: Anju Kurian Dazzles In Yellow Saree Photoshoot

Anju Kurian is serving major fashion inspiration with her latest sun-drenched ethnic look. Dressed in…

2 hours ago