Telugu

సౌందర్యతో ఎఫైర్ ఉందని ఒప్పుకున్న హీరో!

కొన్నేళ్ల క్రితం బిజెపి తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన నాటి అందాల నటి సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు. హీరో జగపతిబాబు, సౌందర్య చాలా సన్నిహితంగా ఉండే వారని, వాళ్లిద్దరి మధ్య ‘ఎఫైర్’ నడుస్తోందనే వదంతులు నాడు గట్టిగానే హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై స్పందించిన జగపతిబాబు… తాను మహిళలను ప్రేమిస్తానని, అందులో ఎటువంటి అనుమానం లేదన్నాడు.

అయితే తాను ఎప్పుడూ దొడ్డి దోవలో వెళ్లనని, తనది ఎప్పుడూ రాజమార్గమేనని, ఆ విధంగా వెళ్లినప్పుడు తనను అందరూ ఫోకస్ చేశారని చెప్పాడు. సౌందర్య గురించి చెప్పాలంటే… తమ మధ్య ఎఫైర్ లేదంటే ఎవరూ నమ్మరేమోనని, అయితే సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులని చెప్పారు. తనను వారి కుటుంబ సభ్యుడిలా భావించేవారని, అదే విధంగా, ప్రతి విషయంలోనూ తాను వారి కుటుంబంలో ఒకడిలా ఉన్నానని చెప్పాడు.

ADVERTISEMENT

ఆమెకు – తనకు ఉన్న సంబంధం పేరును ఒక ఎఫైర్ అని పిలవడం కన్నా… ఓ మంచి స్నేహమని చెప్తే బాగుటుందని, ఎఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదని, అలా ఆలోచించే వాళ్లు కచ్చితంగా మతి భ్రమించిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. మగవాళ్లకు మహిళలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా? అని జగపతిబాబు ప్రశ్నించారు. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని, అయితే ఆ అఫైర్ అందరూ అనుకునేది కాదంటూ జగపతిబాబు స్పష్టం చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇంత అయోమయం దేనికి రాజా?

రాహుల్‌ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…

9 minutes ago

Breaking: Revanth Removes Konda Surekha From Cabinet!

Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…

42 minutes ago