
అయితే అంతా సర్దుమణిగింది అన్న సమయంలో తాజాగా రవిశాస్త్రిపై గంగూలీ మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒక రకంగా రవిశాస్త్రి వ్యవహార శైలిని బయటపెట్టిన మాటలుగా క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీసీఐ హెడ్ కోచ్ కావాలని రవిశాస్త్రి అనుకున్నారని, అయితే టీమిండియాకు కీలకమైన బ్యాటింగ్ కోచ్ గా ఉండాలని తాము కోరామని, అందుకు రవిశాస్త్రి అంగీకరించలేదని అన్నాడు.
తన కంటే జూనియర్ అయిన అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా ఉంటే తాను బ్యాటింగ్ కోచ్ గా ఉండటం రవిశాస్త్రికి ఇష్టం లేకనే ఆ పదవి వద్దన్నాడంటూ… గంగూలీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో శాస్త్రికున్న ఇమేజ్ ను ఓ రేంజ్ లో డ్యామేజ్ చేస్తున్నాయి. గంగూలీతో పెట్టుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి అంటున్నారు ‘దాదా’ అభిమానులు.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…