
ఇందుకు పెద్దగా డౌట్స్ లేవు గానీ… ‘స్పైడర్’ సినిమాకు సంబంధించి ఇంకా పాట చిత్రీకరించాల్సి ఉంది. ఆగష్టు మొదటి వారంలోనే ఇది పూర్తి కావాల్సి ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్ వీసా సంబంధిత ఇబ్బందులతో, అది కాస్త వాయిదా పడింది. దీంతో మళ్ళీ ‘స్పైడర్’కు అడ్డంకులు తప్పవా? ఆ పాటను ఎప్పుడు షూట్ చేస్తారు? ఈ పాట వలన విడుదలకు మళ్ళీ ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న ఆందోళనలో ప్రిన్స్ ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా దీనిపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం “భరత్ అనే నేను” షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు, ఆగష్టు 23వ తేదీ నుండి చివరి పాట షూటింగ్ కోసం రుమేనియా వెళ్లనున్నారు. ఆగష్టు 22 వరకు ‘భరత్ అనే నేను’ షూటింగ్ లో పాల్గొని, మరుసటి రోజు నుండి రకుల్ తో కలిసి రుమేనియాలో స్టెప్పులు వేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకున్న తర్వాత వెంటనే తిరుగు ప్రయాణం కానున్నారు.
దీంతో సెప్టెంబర్ 27వ తేదీన “స్పైడర్” సినిమా విడుదల అవుతుందా? లేదా? అన్న సందేహాలకు తావు లేకుండా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రుమేనియా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆడియో వేడుకను గానీ, ట్రైలర్ రిలీజ్ వేడుకను నిర్వహించాలని, అలాగే విడుదలకు ఓ వారం రోజుల ముందు ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ను ఏర్పాటు చేసే విధంగా ప్రమోషన్ కార్యక్రమాల ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…
Nayanthara has built one of the strongest brands for a South Indian heroine. But her…