
ప్రస్తుత పరిస్థితికే వస్తే… బుధవారం విడుదల కాబోతున్న “స్పైడర్” సినిమాకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ దాదాపుగా ఏపీ, తెలంగాణాలోని అన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి, ఒక్క విజయవాడలో తప్ప! కేవలం రెండంటే రెండు రోజులు ఉంచుకుని కూడా ఇంకా టికెట్లు ఎందుకు ఓపెన్ కాలేదన్న విషయం సినీ ప్రేక్షకులకు అంతుపట్టదు. అయితే అసలు ఓపెన్ కాకుండా ఉంటుందా? అంటే ఉండదు. ఏదో అర్ధరాత్రి సమయాలలో ఓపెన్ చేసినట్లుగా చెప్తారు, ఓపెన్ చేసిన వెంటనే టికెట్లు కూడా అయిపోయాయని ప్రకటిస్తారు.
మల్టీప్లెక్స్ ల పుణ్యమా అని ప్రస్తుతం ఆన్ లైన్ టికెట్ల ఒరవడి బాగా పెరిగింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మచిలీపట్టణం వంటి ఏరియాలలో కూడా ‘స్పైడర్’ బుకింగ్స్ ఓపెన్ చేసారు. కానీ సినిమాలే వినోదంగా భావించే విజయవాడ వాసుల నిరీక్షణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే… విజయవాడలో సినిమా టికెట్లు అనేది ఒక దందాగా మారింది. టికెట్ లభించాలంటే… డిపార్టుమెంటు ద్వారా గానీ లేక రాజకీయ ఆధిపత్యం ద్వారా గానీ లేక ధియేటర్ లో తెలిసిన వారుంటే కానీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
‘పలుకుబడి’ ఉంటేనే విజయవాడలో ‘ఫస్ట్ డే టికెట్,’ లేదంటే బ్లాక్ దందా రాయుళ్ళ చేతిలో సినీ ప్రేక్షకులు బలి కావాల్సిందే. గతంలో ఓ వారం రోజుల పాటు సాగే ఈ దందా, ప్రస్తుతం ఒక్క రోజుకే పరిమితం అయ్యింది. ఒకవేళ ‘బాహుబలి 2’ మాదిరి భారీ పాజిటివ్ టాక్ వస్తే… ఇక అంతే..! టాక్ సినిమాకు అనుకూలంగా రాని పక్షంలో, వెంటనే రెండవ రోజు నుండి ఆన్ లైన్ లో బోలెడు టికెట్లు ప్రత్యక్షం అవుతాయి. టికెట్ల ద్వారా ఇలా సామాన్య ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టే, వినోదం కోసం వారు కూడా ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…