
సహజంగా వీకెండ్స్ లో… శుక్రవారం నాడు, ఒక్కోసారి గురువారం నాడు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ “స్పైడర్” విడుదలకు ముహూర్తాన్ని బుధవారం నాడు ఫిక్స్ చేయడంతో… వీకెండ్ ముగియాలంటే 5 రోజులు ఉంది. ‘స్పైడర్’కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ అయిదు రోజుల్లోనే ‘నాన్ బాహుబలి’ రికార్డులు కనుమరుగు కావడం తధ్యం అన్న అభిప్రాయం ట్రేడ్ పండితులలో వ్యక్తమవుతోంది.
ఒకవేళ సినిమాపై భిన్న స్పందనలు వచ్చినా… రెండవ వీకెండ్ నాటికి రికార్డులన్నీ ‘స్పైడర్’ వశం కావడం అన్న భావన కూడా హల్చల్ చేస్తోంది. ఎందుకంటే… ‘బాహుబలి’ తర్వాత అంతటి స్థాయిలో అటు ట్రేడ్ వర్గాలలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ అంత బజ్ ను సొంతం చేసుకున్న సినిమా “స్పైడర్.” తెలుగు, తమిళ భాషలతో పాటు చివరి నిముషంలో హిందీ, మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Pakistan have made several changes to their Test team during the England series, and former…