
“స్పైడర్” రెండవ టీజర్ డిజిటల్ మీడియాలో 10 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబు ‘హార్ట్ బ్రేకింగ్’గా ఉన్నాడు. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో చేతికి వాచ్, బ్యాక్ జేబులో చేయి పెడుతూ ఉన్న ఈ పోస్టర్ ప్రిన్స్ అభిమానులకు కన్నులవిందుగా మారింది. తాజాగా విడుదలైన టీజర్ లో ఇలాంటిది కనీసం ఒక్క షాట్ ఉన్నా కూడా ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. కానీ అందుకు విరుద్ధంగా టీజర్ ఉండడంతో, ప్రస్తుతం పోస్టర్స్ తో హంగామా చేస్తున్నారు.
ఇప్పటివరకు ‘స్పైడర్’కు రిలీజ్ అయిన పోస్టర్స్ లో ‘ది బెస్ట్’గా ఈ పోస్టర్ ను కితాబివ్వవచ్చు. ప్రిన్స్ హీరోయిజానికి నిదర్శనంగా నిలిచిన ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో హంగామా చేయకుండా ఉంటుందా! వీడియో ద్వారా పడుకోబెట్టిన అభిమానులను ఈ పోస్టర్స్ తో కాస్త బుజ్జగించే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. మరో విశేషం ఏమిటంటే… బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ ధరించిన ప్రిన్స్ పోస్టర్లను మాత్రమే చిత్ర యూనిట్ విడుదల చేస్తుండడం గమనించదగ్గ అంశం.
Ram Charan and Sukumar's RC17 has started attracting attention even before the film gets going.…
BOTTOM LINE A Grounded, Pleasant Joint Family Saga PLATFORM Netflix RUNTIME 2 Hrs. What Is…