
ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ తో రన్ అవుతున్న నేపధ్యంలో… దసరా విజేత ఎవరన్నది? అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే మరో సినిమా ఇంకా మిగిలి ఉన్న నేపధ్యంలో… దసరా విజేతను ప్రకటించడం ఇప్పుడే సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే ఈ సంక్రాంతికి విడుదలైన శర్వానంద్ “శతమానం భవతి” సంక్రాంతి సినిమాలలో ఎక్కువ లాభాలను పంచిన సినిమాగా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి రెండింతలు అందించిన సినిమాగా నిలిచి, సంక్రాంతి ‘రియల్ విన్నర్’గా రికార్డులకెక్కింది.
ప్రస్తుతం విడుదలైన రెండు సినిమాలతో పోలిస్తే… తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన “మహానుభావుడు” సినిమానే ఈ దసరా ‘విజేత’గా ఆవిష్కరించే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు పెద్ద సినిమాలలో లోపించిన ‘కామెడీ’ యాంగిల్, ‘మహానుభావుడు’ సినిమాలో ఉండనున్న నేపధ్యంలో… దసరా ‘విజేత’ను ప్రకటించాలంటే, ఈ శుక్రవారం వరకు వేచిచూడాల్సిందే. ఒకవేళ ఈ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంటే, అప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ను విజేతగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…