
వార్నర్ లంక బౌలర్లపై విరుచుకుపడగా, మరో ఓపెనర్ షాన్ మార్ష్ నింపాదిగా ఆడుతూ వ్యక్తిగత స్కోర్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను 160 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఒక్క వార్నర్ 68 పరుగులు మినహా మరొకరు ఎవరూ లంక బౌలర్లను ప్రతిఘటించ లేకపోయారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో లంక స్పిన్ మాంత్రికుడుగా మారిన హేరాత్ 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో కలిపి మొత్తం 13 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు హేరాత్. అలాగే మూడు టెస్ట్ మ్యాచ్ లలో కలిపి 28 వికెట్లు సొంతం చేసుకుని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు ఈ స్పిన్ మాంత్రికుడు. మూడు టెస్ట్ మ్యాచ్ లలోనూ దారుణ వైఫల్యం చెందడంతో నిరాశతో ఉన్న ఆసీస్ జట్టు, ఈ నెల 21వ తేదీ నుండి 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…