
గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా ‘హైపర్ ఆది అండ్ కో’పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. ‘జబర్దస్త్’ షో ద్వారా అనేక మంది ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తున్నందుకు ఆది పైన గౌరవం ఉందంటూ ప్రారంభించిన శ్రీరెడ్డి, తమ పైన పంచ్ లు వేయడానికి, తమ మనోభావాలు దెబ్బతినే విధంగా స్క్రిప్ట్ లు, డైలాగ్స్ రాయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఇలాగే చేసుకుంటూ పోతే నీ మీద నా చెప్పు కాదు, వంద చెప్పులు పడతాయి అంటూ హెచ్చరికలు జారీ చేసింది.
ఇలా పిచ్చి వేషాలు వేసే వాళ్ళకి, వాటిని చూస్తూ అక్కడ వెర్రి నవ్వులు నవ్వుతున్న వాళ్లకు అంటూ హైపర్ ఆది మరియు నాగబాబును ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ‘షర్టు విప్పు… ఇంటర్నేషనల్ మీడియా వస్తుంది’ అన్న డైలాగ్ తనను ఉద్దేశించి రాసినదేనని, నేను చేసింది నిరసన కోసం గానీ, సెక్స్ కోసం కాదని, ఇది అర్ధం చేసుకోలేని నువ్వు ఒక అమ్మకు పుట్టావని గుర్తుంచుకో అంటూ మండిపడిన శ్రీరెడ్డి, ‘నిన్ను మామూలుగా కొట్టను ఆది, నాకొస్తున్న కోపానికి ఎదురుగా నువ్వుంటే ఏం జరిగేదే’ అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది.
గతంలో ఇలాగే కత్తి మహేష్ పైన కూడా జోకులు వేసావని, ఇప్పుడు నా మీద వేస్తున్నావని, ఇలా చేయమని ఎవరు చెప్తున్నారు? నీ వెనుక ఎవరు ఉన్నారు? జబర్దస్త్ లో అందరూ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటుంటే, నువ్వు మాత్రం ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు? నీకొచ్చిన దురద ఏంటి ఆది గారు? నీ వెనుక ఎవరున్నా, వాళ్లకి ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించింది. నా చేతికున్న దురద మామూలుగా ఉండదు ఆది గారు అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఫేస్ బుక్ వీడియో వైరల్ అవుతోంది.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…