Reviews

ఎవరి వల్లా కాలేదు… ఒక్క శ్రీరెడ్డి వలన మాత్రమే..!

తాను చేసిన పని వలన ఇంత మంచి కార్యం జరుగుతుందని బహుశా శ్రీరెడ్డికి తెలుసో లేదో గానీ, తన ప్రమేయం లేకుండానే ఓ మహత్తర కార్యాన్ని శ్రీరెడ్డి సాధించింది. సోమవారం నాడు మీడియాకు అడ్రస్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర రీతిలో మండిపడిన శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు మండిపడ్డారు. శ్రీరెడ్డి ‘బోర్డర్’ దాటిందంటూ అప్పటివరకు సపోర్ట్ చేసిన కొందరు నెటిజన్లు కూడా ఈ విషయంలో ఆమెనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు.

ఇక ఈ విషయంలో ప్రత్యక్షంగా ఎంటర్ కాకపోయినా, తమ సహకారం పవన్ కళ్యాణ్ కే అంటూ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ట్వీట్లు చేయడం ఊహించని పరిణామం. ఇండస్ట్రీలోకి మహేష్ బాబు అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ప్రిన్స్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. చాలా సందర్భాలలో ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఫైట్ మీడియాలకు కూడా ఎక్కింది. వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు అటు పవన్ వర్గం గానీ, ఇటు మహేష్ వర్గం గానీ చేయలేకపోయాయి.

ADVERTISEMENT

కానీ ఇపుడు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరూ ఏకం కావడం విశేషం. ‘మేము మేము ఎన్నైనా కొట్టుకుంటాం గానీ, ఇతరులు మా హీరోలను అకారణంగా అంటే మాత్రం సహించం, ఈ సందర్భంలో మా మద్దతు పూర్తిగా పవన్ కళ్యాణ్ కే’ అంటూ చేస్తోన్న ట్వీట్లు హర్షించదగ్గ విషయం. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉన్నా గానీ, మహేష్ – పవన్ అభిమానులను ఏకం చేసిన ఘనత మాత్రం ఒక్క శ్రీరెడ్డికే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

2 hours ago

Dulquer’s Plot Leaked Before Release: BMS Responsible?

Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…

2 hours ago