
‘నాన్నకు ప్రేమతో సినిమాలో మీది చాలా లిమిటెడ్ రోల్, దానిని ఎందుకు అంగీకరించారు?’ అన్న ప్రశ్నకు… ‘సుకుమార్, ఎన్టీఆర్ మరియు లండన్ కోసమని’ నిర్మొహమాటంగా చెప్పారు అవసరాల. సుకుమార్, ఎన్టీఆర్ లాంటి వ్యక్తులతో పనిచేయాలన్న తన ఆకాంక్ష తీరడం ఒక మాటయితే, లండన్ లో 10 రోజుల షూటింగ్ అన్నారు, అది ఖచ్చితంగా ఓ 25 రోజులైనా అవుతుంది’ అన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను అంగీకరించాను అని చెప్పగానే… ప్రశ్నలు వేసే వెబ్ మీడియా ప్రతినిధి కూడా ‘ఓ… సుకుమార్ కాబట్టి…’ అంటూ నవ్వడం ప్రారంభించారు.
ఇక్కడ సుకుమార్ ప్రతిభపై గానీ, అవుట్ పుట్ విషయంలో గానీ, ఎలాంటి కామెంట్ చేయలేదు గానీ, సహజంగా సుకుమార్ గురించి ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేసే విషయాన్నే, చాలా ఆహ్లాదకరంగా హాస్యం పండే విధంగా అవసరాల చెప్పుకొచ్చారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎడిటింగ్ లో ఏమీ పోలేదని, తన పాత్ర పరిధి అంతేనని, అయితే, ‘అ…ఆ…’ సినిమా ఎడిటింగ్ లో తన పాత్ర పూర్తిగా పోయిందని కూడా నవ్వుతూ చెప్పారు అవసరాల శ్రీనివాస్.
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…