
కానీ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ‘శతమానం భవతి’లో ప్రదర్శించిన ఏమోషన్, ఈ ‘శ్రీనివాస కళ్యాణం’లో పండించలేకపోయారు. అలాగే ‘శతమానం భవతి’ సినిమాలో హ్యుమర్ ఎక్కువగా పండింది. కానీ ఈ సినిమాలో నవ్వుకోవడానికి సన్నివేశాలు కోరవవ్వడంతో సినిమా అంతా చాలా నింపాదిగా సాగుతున్నట్లు… ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేదిగా మారింది.
దీంతో టాలీవుడ్ లో పేరుబడ్డ ద్వితీయ విఘ్నాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్న దాటలేకపోయారు. అలాగే వరుస వైఫల్యాలు అందుకుంటోన్న నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్, హీరోయిన్ రాశి ఖన్నాల ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్లయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రమే ఉన్న ఓపెనింగ్స్, రెండవ రోజు పడిపోవడంతో కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి ఫ్లాప్ ను అందుకుంటుందో చూడాలి. ‘దిల్’ కాంబో రాజు – నితిన్ లు ఈ సారి చేదు అనుభవాన్ని చవిచూడక తప్పని పరిస్థితి.
విక్టరీ వెంకటేష్ టైటిల్ ఇలా వృధా కాగా, తన తదుపరి సినిమాకు కింగ్ నాగార్జున ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ “హలో గురూ ప్రేమ కోసమే” టైటిల్ గా దిల్ రాజు నిర్ణయించడం విశేషం. అలాగే మహేష్ తో తీస్తోన్న సినిమా “మహర్షి” కూడా ఒకప్పటి సూపర్ హిట్ టైటిలే. ఈ సినిమాతోనే రాఘవ కాస్త టాలీవుడ్ లో ‘మహర్షి’ రాఘవగా మారిపోయారు. మరి ఈ టైటిల్స్ లో ఏ టైటిల్ దిల్ రాజుకు సక్సెస్ ను తెచ్చిపెడుతుందో చూడాలి.
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…