
మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌తో సినిమాలు తీసిన శ్రీనువైట్ల వరుస ఫ్లాప్‌లతో మళ్లీ చిన్న హీరోతో సినిమా చేసే పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం రామ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంది. ఆ నమ్మకంతోనే మళ్లీ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు రామ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. దాంతో ఈ సమయంలో రామ్ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఒకవేళ ఈ సాహసం సక్సెస్ అయితే రామ్ కెరీర్ మరో అయిదు సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేకుండా ముందుకు సాగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. రామ్‌తో సక్సెస్ కొడితే మళ్లీ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం శ్రీనువైట్లకు వస్తుంది. మొత్తానికి వీరి కాంబోలో మూవీ ఇద్దరికి కూడా చాలా ముఖ్యం.
Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…