Telugu

హేయ్… శ్రీను వైట్ల కూడా వేసేసాడు..!

‘ఆగడు, బ్రూస్ లీ’ చిత్రాల వరుస ఫ్లాప్ ల తర్వాత విమర్శకులు ఓ రేంజ్ లో ఆడుకున్న దర్శకుడిగా శ్రీను వైట్ల నిలిచిపోయారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా, ఆత్మవిశ్వాసం కోల్పోని శ్రీను వైట్ల తాజాగా “మిస్టర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… ‘బ్రూస్ లీ’ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాన్ని చెప్పారు. అయితే ఇదేదో రొటీన్ కారణమైతే, విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు గానీ, ఈ కారణంలో శ్రీను వైట్ల ఓ ‘హింట్’ మాత్రం అందించారు.

‘బ్రూస్ లీ’ సినిమా విషయంలో ‘నేను అనుకున్నట్లుగా చేసే పరిస్థితులు లేకుండా పోయాయప్పుడు’ అని శ్రీను వైట్ల చెప్పడం కలకలం రేపుతోంది. అంటే శ్రీను లెక్క ప్రకారం… తనకు తగినంత స్వేఛ్చను ఇవ్వలేదా? లేక సినిమా విషయంలో సహజంగా ఉండే ‘మెగా’ మంత్రం శ్రీనును డామినేట్ చేసిందా? అదీ కాకపోతే అప్పటివరకు దూరంగా పెట్టిన కోన వెంకట్ తో పని చేయడం శ్రీనుకు ఏ మాత్రం ఇష్టం లేదా? ఇలా శ్రీను చెప్పిన కారణం అనేక ప్రశ్నలను, సందేహాలను మిగిల్చింది.

ADVERTISEMENT

ఓ పక్కన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా సందర్భంగా చిరంజీవి తనకు అన్యాయం చేసాడంటూ నటుడు రాజ్ కిరణ్ వాపోవడం, ఇదే సమయంలో శ్రీను వైట్ల నుండి మరో ప్రకటన రావడంతో, దర్శకులకు మెగా హీరోలు కావాల్సిన ఫ్రీడంను ఇవ్వడం లేదన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ విషయంలో అధికారికంగా హల్చల్ చేస్తున్న ఈ టాక్, ఇతర మెగా హీరోలకు కూడా పాకితే, దర్శకులలో సృజనాత్మకత లోపించే ప్రమాదం లేదంటారా? ఇక దీనిపై మెగా కాంపౌండ్ పెదవి విప్పాల్సి ఉంటుంది..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ: కొండ నాలుకకు మందేస్తే…

మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…

14 minutes ago

Revanth @ Hyderabad: Konda Surekha In Focus!

The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…

18 minutes ago