
తన తదుపరి సినిమా కోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ లతో కలిసి రాజమౌళి చర్చలు జరిపారనేది ఇటీవల వినిపించిన వ్యాఖ్యలు. అయితే అలాంటి పరిణామాలేవీ చోటు చేసుకోలేదని తాజాగా ఖరారైన అంశం. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి, అల్లు అర్జున్ ల కలయిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బన్నీ ‘ఐ యాం ది చేంజ్’ చాలా బాగుందని, వ్యక్తిగతంగా ఇది చెప్పడానికి తనకు అవకాశం లభించలేదని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని బన్నీని అభినందించారు జక్కన్న.
ఆ తర్వాత మైక్ అందుకున్న అల్లు అర్జున్… ‘బాహుబలి 2’ సినిమా తర్వాత రాజమౌళిని వ్యక్తిగతంగా ఇదే కలవడం అని, ఈ సందర్భంగా దేశమంతా గర్వించే సినిమాను అందించినందుకు అభినందనలు తెలిపారు బన్నీ. అంటే ‘బాహుబలి 2’ రిలీజ్ నుండి ఇప్పటివరకు వీరిద్దరి కలయిక జరగలేదనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పకనే చెప్పారు. దీంతో గతంలో హల్చల్ చేసినవన్నీ రూమర్లుగా తేలిపోయాయి. ఈ పరిణామాలతో జక్కన్న తదుపరి సినిమా జాబితాలో బన్నీ లేరన్న విషయం స్పష్టమైందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…