చరిత్ర సృష్టిస్తున్న సినిమాపై కులం రొచ్చు!

పాపులర్ అయిన సినిమాలపై వివాదాలు చుట్టుముట్టడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఒక్కోసారి విడుదలకు ముందే వివాదాలు హైలైట్ అవుతుండగా, తాజాగా చరిత్ర సృష్టిస్తున్న ‘బాహుబలి 2’కు మాత్రం విడుదలైన మూడు రోజుల తర్వాత ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో తమ కులాన్ని కించపరిచేలా ప‌లు సీన్లు ఉన్నాయ‌ని ఆరెకటిక సంఘాలు హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు ఆఫీసు ఎదుట భారీ ధర్నాకు దిగాయి.

బాహుబ‌లి-2లో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదం ఉంద‌ని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంద‌ని వెలుగెత్తిన ఆరోపణ. సెన్సార్‌ బోర్డు కూడా ఈ పదానికి అనుమతినివ్వడమేంట‌ని ప్రశ్నిస్తున్న సదరు సంఘం వారు, ఈ సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని న‌గ‌రంలోని బంజారా హిల్స్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చ‌రించారు.

ADVERTISEMENT

ఒకవేళ అప్పటికి ఆ ప‌దాన్ని తొల‌గించ‌క‌పోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన ఉద్ధృతం చేస్తామ‌ని అన్నారు. చూడడానికి చిన్న వివాదంలా కనపడుతున్నప్పటికీ, కులానికి సంబంధించినది కావడంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే ఈ వివాదంపై అటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ, ఇటు సెన్సార్ బోర్డు వారు గానీ ఎవరూ స్పందించలేదు. ఓ పక్కన బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దుగా సాగిపోతున్న ‘బాహుబలి 2’పై వివాదాలు రేపడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mahesh Babu Watches Romanchakam, Here’s His Verdict

Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…

22 minutes ago

‘రోమాంచకం’ సినిమా రివ్యూ: ప్రేమరహితం, హాస్యభరితం, ఉత్కంఠలోపితం!

చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…

43 minutes ago