
దీనికి సంబంధించిన వీడియోను ఏపీ ప్రభుత్వం విడుదల చేయగా, వీక్షించిన వారందరూ రాజమౌళి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిపై సూర్య కిరణాలు ఎలా అయితే ప్రతిబింభించి దర్శనమిస్తాడో, అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా కంప్యూటరైజ్ద్ పరిజ్ఞానంతో అసెంబ్లీలోని తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ డిజైన్ ను సిద్ధం చేసారు.
దీంతో ‘సినిమా వాళ్ళను వస్తే తరిమికొట్టండి’ అంటూ పిలుపునిచ్చిన జగన్ ను ప్రజలు తరిమికొట్టే పరిస్థితి నెలకొంది. ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా రాజమౌళిని ఉద్దేశించి జగన్ చేయకపోయినా… సినీ గ్లామర్ ను తెలుగుదేశం పార్టీ ఎక్కువ వినియోగించుకుంటుందన్న భావనతో జగన్ చేయగా, మరికొద్దిసేపటికే రాజమౌళి దర్శకత్వంలో ఈ వీడియో విడుదల కావడంతో… చంద్రబాబు నిర్ణయాన్ని విమర్శించే వారు కన్నా… సమర్ధించే వారే ఎక్కువగా ఉన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…