
సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నాగవంశీ భావించి ఉండొచ్చు. మరోవైపు రామ్ చరణ్ 15 తాలూకు అనౌన్స్ మెంట్ రేపు తన పుట్టినరోజు నాడు ఉండనుంది. ఇది కూడా అదే సీజన్ కి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనే లీక్ మెగా కాంపౌండ్ నుంచి ఉంది. ఇది తెలిసి ముందే కర్చీఫ్ వేసుకుంటే ఇబ్బంది ఉండదనే ఆలోచనతో హారిక హాసిని పావులు కదిపారు. ఒకవేళ రేపు నిజంగా ఇదే జరిగినా ముందు మేమే చెప్పామనే అడ్వాంటేజ్ మహేష్ 28కి ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగూ చిరంజీవి బాలకృష్ణలు వచ్చే అవకాశం లేదు. పుష్ప 2 ది రూల్ దాదాపు నో ఛాన్స్.
సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు. రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్తామనే నాగవంశీ మాట నిజం కావాలంటే ఇదే సరైన నిర్ణయం. పాజిటివ్ టాక్ వస్తే చాలు మహేష్ త్రివిక్రమ్ లకున్న బ్రాండ్ ఇమేజ్ ఈజీగా వంద కోట్లు మంచి నీళ్లు తాగినట్టు తెచ్చేస్తుంది. ఓవర్సీస్ లో సునామి ఉంటుంది. మొన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు కంటెంట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఏ స్థాయిలో రికార్డులు ఇచ్చారో చూశాంగా. సీనియర్లకు అంత స్పందన దక్కినప్పుడు టాలీవుడ్ క్రేజీ కాంబోగా పేరున్న సూపర్ స్టార్ మాటల మాంత్రికుడి జోడితో జరగబోయే రచ్చే వేరే చెప్పాలా.
ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మధ్యలో ఎన్నో అనూహ్య పరిణామాలు జరగొచ్చు. కానీ మహేష్ 28కి మాత్రం ఎలాంటి ఆందోళన ఉండదు. ఎందుకంటే జూలైకే పూర్తి చేయగలమనే కాన్ఫిడెన్స్ తో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎంత ఆలస్యమైనా మహా అయితే నవంబర్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు టెన్షన్ దీనికన్నా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె, చరణ్ 15ల మీద ఉంటుంది. సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్ టైన్మెంట్ తోనే నాన్ బాహుబలి రికార్డులు అందుకున్న త్రివిక్రమ్ సినిమాతో కనక మెప్పిస్తే మాత్రం రికార్డులు తిరగరాయడం ఖాయం.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…