
ఒకప్పుడు సామాన్య మద్య తరగతి ప్రజలు ‘షేర్ మార్కెట్’లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనే చేసేవారు కారు. ఎందుకంటే వారి ఆదాయం అవసరానికి సరిపడేంత లేదా కాస్త తక్కువగానే ఉండేది. ఆదాయం-ఖర్చులు సమాన నిష్పత్తిలో పెరిగినందున నేటికీ వారి పరిస్థితి అలాగే ఉంది.
అయితే నాడు లేని టెక్నాలజీ నేడు అందుబాటులో వచ్చింది. కనుక ఆలోచనలు, కోర్కెలు కూడా విస్తరించాయి. అలాంటి విస్తరణలో షేర్ మార్కెట్ కూడా వచ్చి చేరింది. షేర్ మార్కెట్ గురించి మిడిమిడి జ్ఞానంతో చెప్పేవారు కొందరు. షేర్ మార్కెట్ పేరుతో కుచ్చు టోపీలు పెట్టేసేవారు మరికొందరు.
మీడియాలో షేర్ మార్కెట్ కబుర్లు… ఇలా రకరకాల ప్రభావాలకు లోనయ్యే మద్య తరగతి వర్గం, టెకీలు, ఉన్నత ఆదాయ వర్గాలు వారు కూడా డీమ్యాట్ అకౌంట్లు తెరిచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారిప్పుడు.
సోషల్ మీడియాలో ఇస్మాయిల్ భాయ్ అనే నెటిజన్ దీని గురించి అడిగిన ఓ చిన్న ప్రశ్న చాలా ఆలోచింపజేస్తుంది. దానికి టెక్నోక్రాట్, సీనియర్ జర్నలిస్ట్ డా.కె. శ్రీనివాస వర్మగారు చెప్పిన సమాధానం ఇంకా ఆలోచింపజేస్తుంది.
ఈ ప్రశ్న, జవాబు, వీటిపై వారి ఖాతాలో జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఉన్నదంతా ఊడ్చిపెట్టి లేదా అప్పులు చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నవారికి ఈ చర్చ కనువిప్పు కలిగిస్తుంది.
అలాగని షేర్ మార్కెట్లో డబ్బు పెట్టిన ప్రతీ ఒక్కరూ నష్టపోతున్నారని వారి అభిప్రాయం కాదు. కానీ ప్రతీ 10 మందిలో 9 మంది నష్టపోతున్నారని చెప్పారు. సెబీ షేర్ మార్కెట్‌ని నియంత్రిస్తున్నప్పటికీ ఏవిధంగా మోసాలు జరుగుతాయో, వాటితో మదుపరులు నష్టపోతుంటారో డా.కె. శ్రీనివాస వర్మగారు చక్కగా చెప్పారు.
అలాగే ఆయన అభిప్రాయాలపై స్పందించిన నెటిజన్స్ చెప్పిన విషయాలు కూడా చాలా ఆలోచింపజేస్తాయి. కనుక ‘స్టాక్ మార్కెట్’లో ఇప్పటికే ఉన్నవారు… అ బంగారు పంజరంలో ప్రవేశించబోతున్నవారు… సోషల్ మీడియాలో వీరి చర్చలను చదివి ఆకళింపు చేసుకుంటే లాభమే తప్ప నష్టం ఉండదు.
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…