“నాన్నకు ప్రేమతో” – సుకుమార్ తప్పు చేయలేదు!

sukumar nannaku prematho trailer talkదర్శకుడిగా సుకుమార్ ప్రతిభ గురించి ఈ రోజు చెప్పడానికేం లేదు. ఒక జనరేషన్ ముందస్తు ఆలోచనలను వెండితెరపై చూపించడంలో సుకుమార్ ది అందె వేసిన చేయి అన్నది సినీ వర్గాలకు, సినీ ప్రేమికులకు తెలిసిన విషయమే. అలాంటి దర్శకత్వ ప్రతిభకు మరో నిదర్శనంగా “నాన్నకు ప్రేమతో” సినిమా రూపొందిందని ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, సుకుమార్ టేకింగ్ ఈ ట్రైలర్ హైలైట్స్. ‘టెంపర్’ తర్వాత మరో వేరియేషన్ లో అభిమానులు ‘బుడ్డోడు’ను చూడవచ్చు. అలాగే ఒక సెటిల్డ్ యాక్షన్లో తారక్ ను చూడడం సినీ ప్రేక్షకులకు కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. సుకుమార్ ఎంచుకున్న లోకేషన్స్, కెమెరా యాంగిల్స్ ఆద్భుతంగా ఉన్నాయి. దేవిశ్రీ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT

ఇక, ట్రైలర్ గురించి, సుకుమార్ గురించి చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. సుకుమార్ గత చిత్రం ‘1 నేనొక్కడినే’ ప్రమోషన్ విషయంలో సుకుమార్ చేసిన రాంగ్ పబ్లిసిటీ, ఆ సినిమా ఫలితాన్ని తలక్రిందులు చేసింది. కానీ, “నాన్నకు ప్రేమతో” విషయంలో సుకుమార్ దానికి తావివ్వకుండా… తను చెప్పదలుచుకున్న కధను ధియేటిరికల్ ట్రైలర్ లో స్పష్టంగా చూపించేసాడు.

“ఒక తండ్రి కోసం కొడుకు పడే తాపత్రయం” సినిమా మూలకధగా కనపడుతోంది. దీని చుట్టూ సుకుమార్ తరహా ‘మైండ్ గేమ్’ అల్లినట్లుగా కనపడుతోంది. జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీరేదిలా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories