Telugu

ఆ ఒక్క ఫోటోలోనే నేను లేను… అదే బయటపెట్టారు..!

గోవా వేదికగా జరిగిన నాగచైతన్య వివాహంలో ‘అక్కినేని’ కుటుంబం మొత్తం పాల్గొంది, ఒక్క హీరో సుమంత్ తప్ప! ఏ కారణాలతో సుమంత్ హాజరు కాలేదో? అంటూ వివాహం సందర్భంగా విడుదల చేసిన చైతూ గ్రూప్ ఫోటోను చూపిస్తూ… సోషల్ మీడియా వేదికగా జరిగిన వివాదం తెలిసిందే. దీనికి తోడు నాగ్ – సుమంత్ మధ్య విభేదాలు నెలకొన్నాయని పుకార్లు షికార్లు చేసాయి.

ADVERTISEMENT

అయితే దీనిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమంత్ స్పష్టత ఇచ్చారు. నిజానికి ఆ వివాహం మొత్తంలో తాను ఉన్నానని, ఆ మరుసటి రోజు జరిగిన రిసెప్షన్ లో కూడా ఉన్నానని, బహుశా ఆ ఒక్క ఫోటోలోనే తాను లేను, అదే బయటపెట్టారు అంటూ సింపుల్ గా ఓ చిరుదరహాసం ప్రదర్శించారు. గ్రూప్ ఫోటో కాబట్టి, దీనికి ప్రాధాన్యత దక్కిందని అన్న సుమంత్, “మళ్ళీ రావా” సినిమా ప్రమోషన్ కు నాగ్ ఎందుకు రాలేదో కూడా తెలిపారు.

“మళ్ళీ రావా” సినిమా ప్రమోషన్ కు అఖిల్, చైతూలు వచ్చారు గానీ, బిజీ కారణాలతో తన చినమామయ్య నాగ్ రాలేకపోయారు తప్ప వేరేదేమి లేదని, ప్రస్తుతం నాగ్ దృష్టంతా అఖిల్ ను నిలబెట్టడంలోనే ఉన్నారని, తన కాలం అయిపోయిందని, ఇప్పుడు అఖిల్ కాలమని చాలా ఓపెన్ గా చెప్పేసాడు సుమంత్. ఇంత మొహమాటం లేకుండా మాట్లాడతాడు కాబట్టే సుమంత్ అంటే అభిమానించే ప్రత్యేక అభిమాన వర్గం ఉంది మరి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Hanuman Reveal to be Another Baahubali Moment?

The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…

21 minutes ago

హీరోయిన్ల బొడ్లు బ్లర్ చేయించారట.. ఇదేం చోద్యం

రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…

41 minutes ago