
‘నరుడా… డోనరుడా…’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలో… ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్…’ అంటూ సూపర్ పంచ్ వేసాడు నాని. అయితే, తాజాగా బదులు తీర్చుకునే అవకాశం సుమంత్ కు వచ్చింది. వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్న నాని ‘మజ్ను’ ఫలితాన్ని మరియు హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని పోలుస్తూ… ‘బయట వర్షం కన్నా, నీ హిట్ల వర్షం ఎక్కువైపోతోంది బాబాయ్…’ అంటూ సమయస్ఫూర్తితో కూడిన పంచ్ వేసాడు సుమంత్.
ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆహ్లాదకరమైన పంచ్ లు వేసుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. మరో విశేషమేమిటంటే… నాని నటించిన ‘మజ్ను’ ప్రదర్శితమవుతున్న ధియేటర్లలో సుమంత్ నటించిన ‘నరుడా… డోనరుడా…’ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. ‘మజ్ను’ సినిమా ఫలితం మాదిరే ఈ సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనలను రాబట్టడంలో సూపర్ సక్సెస్ అవుతున్నాడు సుమంత్.
NTR is currently focused on his ongoing project Dragon, which marks his collaboration with Prashanth…
Anjana Rangan is giving black-and-gold dressing a confident new attitude. In a sleeveless floral brocade…