Telugu

సినీప్రియులకు శుభవార్త…. కమెడియన్ గా మళ్ళీ సునీల్!

బ్రహ్మానందం కామెడీని తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరైన సన్నివేశాలతో కామెడీని చిత్రీకరిస్తే… ఒంటి చేత్తో సినిమాను విజయవంతం చేయగల స్థాయి బ్రహ్మమిది… అలాగే ఆ స్థాయిలో కామెడీ కోరుకునే అభిరుచి తెలుగు ప్రేక్షకులది. కానీ ఇటీవల కాలంలో కామెడీ వికృత రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. అవుట్ డేటెడ్ బ్రహ్మి కామెడీకి తోడు ఆ రేంజ్ లో హాస్యాన్ని పండించే సునీల్ కమెడియన్ నుండి హీరోగా మారడంతో సినీ ప్రేక్షకులకు కామెడీ కొరత ఏర్పడింది.

అయితే వారందరికీ శుభవార్త కలిగించే అసలు విషయం ఏమిటంటే… హీరోగా మారిన సునీల్ మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తబోతున్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి సినిమాలో కాదు… మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాలో కమెడియన్ గా చేయాలని స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేసి అడగడంతో సునీల్ ఒప్పేసుకున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది కేవలం ఈ ఒక్క సినిమా వరకే పరిమితం అవుతుందా లేక కమెడియన్ గా సునీల్ రీ ఎంట్రీ ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT

ఏది ఏమైనా మెగాస్టార్ నటించబోయే మెగా మూవీలో మాత్రం చిరు పక్కన కమెడియన్ క్యారెక్టర్ మాత్రం సునీల్ దేనని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కామెడీని ఇష్టపడే సినీ ప్రియులు, ముఖ్యంగా సునీల్ హాస్యాన్ని వెండితెరపై వీక్షించాలనే అభిమానులకు ఈ సమాచారం మిక్కిలి సంతోషాన్ని పంచుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచిచూడడం ప్రేక్షకుల వంతు!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

1 minute ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

4 minutes ago