Telugu

పుష్ప ఒక్క పోస్టర్…అనేక అనుమానాలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో నటిస్తున్న చిత్రం పుష్ఫ. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా….మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమాలో సునీల్ పాత్ర గురించి సోషల్ మీడియాలో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్లే సునీల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అది చూశాక…సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT

ఫస్ట్ లుక్ పూర్తిగా ఆర్టిఫిషల్ గా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆ తీక్షణమైన చూపులు, గాజు కళ్లలో క్రోధం..గోల్డ్ షేడ్ ఖద్దరు చొక్కా…చేతికి వాచీ…మెడనిండా గోల్డ్ సిల్వర్ చైన్స్… చేతి వేళ్లకు ఉంగరాలు…ఇవన్నీ చూస్తుంటే…సునీల్లో విలన్ కన్నా..కమెడియాన్ గానే చూసినట్లు ఫీల్ అవుతున్నారు నెటిజన్లు.

లుక్ ఎంత వాయిలెంట్ గా ఉన్నాసరే…సునీల్ వాయిస్ తో అదికాస్తా కామెడీగా మారుతుందంటూ యూత్ కామెంట్లతో చెలరేగుతున్నారు. మరీ సీరియస్ లుక్ సునీల్ కు సూట్ అవ్వదంటూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. సునీల్ కు కమెడియన్ గా చాలా అనుభవం ఉంది.

ఇంతకాలం ఒక మంచి కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. కానీ పుష్పమూవీలో విలన్ పాత్ర అనేసరికి…నెటిజనుల్లో దుమారం చెలరేగింది. కమెడియన్ గా రాణించిన సునీల్…విలన్ పాత్రకు న్యాయం చేయలేడెమోనన్న ప్రచారం జోరుగా సాగుతోంది

ఇక సుకుమార్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. తన దగ్గరున్న ఆర్టిస్టులతో బాగా పనిచేయించుకుంటాడన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ సినిమాలో సునీల్ పాత్రకు ఎలాంటి న్యాయం చేయనున్నాడు. మంగళం శ్రీనుగా పుష్పరాజ్ కు నిజంగానే చెమటలు పట్టించనున్నాడా లేదా అనేది చూడాల్సిందే.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by
Tags: cross link

Recent Posts

భయపడాల్సింది వాళ్ళే… కూటమి కాదు!

‘మున్సిపోల్స్’లో కూటమి ఘన విజయం సాధించడంపై మూడు పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. వాటికి ఓట్లు వేసిన ప్రజలు కూడా సంతోషిస్తున్నారు.…

27 minutes ago

Kamala Harris’ ‘Haleluya’ Video Goes Viral After Democrats’ Win

Former US Vice President Kamala Harris celebrated the Democratic Party's sweeping victory in the 2026…

31 minutes ago